ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో మనం చాలా వరకు సక్సెస్ అయ్యామని తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్స్పష్టం చేశారు. ప్రజలు అందరి సహకారంతో ఈ విజయం సాధించామని ఆయన అన్నారు.
కరోనాకు చికిత్స ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక కరోనా కట్టడికి స్వీయ క్రమశిక్షణ ఒక్కటే మార్గమని చెప్పిన కేసీఆర్ ... ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దయచేసి ప్రజలు అందరూ సహకరించాలని.. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఓపిక పడితే దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని..
కాని అప్పటి వరకు ఓపికగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేసీఆర్చెప్పారు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే కరోనాపై మనం గెలుస్తాం...నియంత్రణ పాటించడమే కరోనాపై గెలిచేందుకు ఉన్న ఏకైక మార్గమని ఆయన కుండబద్దలు కొట్టేశారు.
]]>