అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశానికి మద్దతు గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. వైరస్ కి సరిహద్దులు ఉండవని ఎక్కడైనా విస్తరిస్తుంది అని తెలిపింది. అందరిని అప్రమత్తం చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు హితవు పలికింది. దీంతో ఈ విషయంపై చైనా స్పందించింది. లేనిపోని ఆరోపణలు చేస్తూ తైవాన్ వాసులు స్వాతంత్రం కోసం వైరస్ ని వాడుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఒక ఉద్దేశపూర్వకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ని అడ్డంపెట్టుకుని సరికొత్త కుట్రకు, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడానికి తైవాన్ వాసులు రెడీ అవుతున్నట్లు చైనా ఆగ్రహించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం పెద్దది కావడంతో చాలా దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పై విమర్శలు చేస్తున్నారు. ఎవరి దేశాల లెక్కలు వారికి చెప్పాలి గాని ఈ విధంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదని వరల్డ్హెల్త్ఆర్గనైజేషన్ పై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇలాంటి చెత్త పనులు చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కె చెల్లుతుంది అంటూ అమెరికాగట్టిగా విమర్శలు చేస్తోంది.
]]>