విభజనతో నష్టపోయిన రాష్ట్రం, పైగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కి ముఖ్యమంత్రికావడం ...కరోనా వైరస్ రావటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జగన్. ఒకవైపు ఆర్థికభారం, మరోవైపు ప్రతిపక్ష ప్రశ్నలు, ఇంకోవైపు పరిశ్రమలు స్థాపించడం విషయంలో అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం తో జగన్తో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా ఎన్నికలు జరిగి గెలిచి ఏడాది అయ్యింది. ఇంకా మూడు సంవత్సరాలలో కరోనా వైరస్కట్టడి చేయడంతో పాటు రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో ఎలా నెరవేరుస్తారు అన్నది ఎవరికీ తెలియని పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయంకరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు అనేవి బాగా వినబడతాయి అని చాలామంది అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే రాబోయే నాలుగు సంవత్సరాలు జగన్పరిపాలన కత్తిమీద సాములా గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
]]>