తాజాగా మరోసారి లోకేశ్ప్రవర్తన పప్పు తరహాలోనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంతకూ విషయం ఏంటంటే.. కరోనా విషయంలో తెలుగుదేశం పార్టీలాక్ డౌన్ పొడిగించాలని చెబుతోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన పార్టీపొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఇదే నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీఓ లేఖను ముఖ్యమంత్రిజగన్కు కూడా పంపింది. అంటే పార్టీపరంగా తెలుగు దేశం లాక్ డౌన్‌ను అంగీకరిస్తున్నట్టే కదా.
కానీ చంద్రబాబు లాక్ డౌన్ పొడిగింతకు మద్దతు ఇస్తుంటే.. ఆయన కుమారుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్మాత్రం లాక్ డౌన్ పొడిగిస్తే ఎలా.. పేద ప్రజలు ఏమైపోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనా ప్రభావంతో పేద ప్రజలు అల్లాడుతుంటే.. లాక్ డౌన్ పొడగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని తెదేపాజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తన పోస్టుల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు పనులు లేక, తినడానికి తిండి లేక, ఎక్కడికీ కదల్లేని దుర్భర జీవితం గడుపుతున్నారని లోకేశ్అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు పుట్టే అవకాశం కూడా లేనందున సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను ముఖ్యమంత్రిజగన్ఆదుకోవాలని లోకేశ్కోరారు. వారికి తక్షణమే రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారట. పేదలను ఆదుకోవాలని కోరడంలో న్యాయం ఉంది. కానీ లాక్‌డౌన్ పొడిగింపును వ్యతిరేకిస్తే ఎలా లోకేశూ అంటున్నారు విశ్లేషకులు.
]]>