అయితే మెజారిటీ సీఎంలు లాక్ డౌన్ పొడిగించాలని కోరితే ఏపీసీఎం జగన్మాత్రం లాక్ డౌన్ రెడ్జోన్లకే పరిమితమైతే మంచిందని కోరారు. అదే సమయంలో కేంద్రం బాటలోనే పయనిస్తామని చెప్పారు. కాకపోతే ఏపీఆర్ధిక పరిస్థితి దృష్ట్యా లాక్ డౌన్ రెడ్జోన్లకే పరిమితం చేయాలన్నారు. ఇక జగన్ఇలా ప్రధానిని కోరారో లేదో, అప్పుడే ప్రతిపక్ష టీడీపీనేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలన్న జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు.
ఇక ఈ విమర్శలని పక్కనబెడితే సీఎం జగన్అలా ఎందుకు చెప్పారనే దానిపై ఒక్కసారి ఆలోచిస్తే, ఏపీఆర్ధిక పరిస్థితి ఏంటో ప్రస్తుతం జగన్కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల ఆదాయం వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. దీంతో జగన్కొన్ని ఆంక్షలు కొనసాగిస్తూనే, వ్యవసాయ రంగంపై సడలింపు కావాలని కోరారు. రాష్ట్రంలో మెజారిటీ ఉపాధి కల్పన ఉండే వ్యవసాయంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదంటే, కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ తీసేస్తానే మంచిదని ప్రధానిని కోరారు.
కాకపోతే ప్రధానిఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని కూడా అయన చెప్పారు. అయితే అలా జగన్చెప్పడమే ప్రతిపక్షాలు ఆలోచించకుండా విమర్శలు చేసేస్తున్నాయి. జగన్చెప్పింది సరిగా వింటే వారికి కూడా పరిస్థితి ఏంటో అర్ధమయ్యేది. మరి చూడాలి ఏపీలో లాక్ డౌన్ పొడిగింపులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.
]]>