తాజాగా ఏపీఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్మీడియాకు చెందిన కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు చేసిన తప్పటడుగులు జగన్కు తలవంపులు తీసుకు వచ్చాయి. ఇప్పటికీ జగన్ఆలోచనలు, నిర్ణయాలను అంచనా వేయడంలో జగన్మీడియాటీం విఫలం అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసిపిప్రతిపక్షంలో ఉన్న సమయం కంటే అధికారంలో ఉన్న సమయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. కానీ ఆయన సొంత మీడియాటీం మాత్రం దానికి అనుగుణంగా పనిచేయలేక జగన్కు తలవంపులు తీసుకువచ్చే విధంగా తయారయ్యింది. తాజాగా వైసీపీప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ... టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆకస్మాత్తుగా తప్పించే విధంగా జగన్ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్తో ఆమోదం పొందేలా చేసుకుని ఎన్నికల సంఘం నిబంధనలు మార్పు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పూర్తిగా తప్పించింది వైసీపీప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి ఉండాలనే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ సమయంలో జగన్మీడియాలోని కొంతమంది వ్యక్తులు జగన్కు క్రెడిట్ రాకుండా వ్యవహరించడం పై జగన్సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్నిర్ణయం ప్రకటించక ముందే సీనియర్ ఐఏఎస్ అధికారి రాంచందర్ రెడ్డిని నియమిస్తున్నారు అంటూ జగన్మీడియాలోని ప్రముఖ వ్యక్తులు కొందరు లీకులు ఇచ్చారు. దీంతో బిబిసి వంటి ప్రఖ్యాత మీడియాసంస్థలు కూడా జగన్మీడియాలీకులను ఆధారంగా చేసుకుని దానికి అనుగుణంగా కథనాలు ప్రచారం చేశారు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని జగన్ఎన్నికల అధికారి నియమించడంపై వైసిపివ్యతిరేక మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్అసలు తన నిర్ణయం ఏమిటో తెలియక ముందే ఏ విధంగా లీకులు ఇచ్చారు అనే విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయం తెలియజేయకుండానే ముందుగా తనను అభాసుపాలు చేసేలా లీకులు ఇచ్చిన వ్యక్తి ఎవరు అనే విషయం పై జగన్పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆరాతీస్తున్నారట. ప్రస్తుతం ఈ వ్యవహారం జగన్మీడియాలోనూ, పార్టీలోనూ, తీవ్రస్థాయిలో చర్చగా మారింది. తనకంటూ సొంతంగా మీడియాఉన్నా, మీడియాసలహాదారులు ఉన్నా జగన్మాత్రం అదే మీడియావిషయంలో ప్రతి సందర్భంలోనూ, అభాసుపాలవుతూనే ఉన్నారు. సాక్షివిషయంలో జగన్మరింత శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందేమో కదా !
]]>