అయితే ఈ మూవీత్వరగా పూర్తి చేసుకొని వెసవిలో రిలీజ్ చేయాలని భావించారు. ఇంతలో కరోనా అడ్డం రావడం.. షూటింగ్స్ మొత్తం వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ ఖాళీ సమయంలో ప్రి ప్రొడక్షన్ పనులు మరింత పక్కాగా చేసుకునే పనిలో ఉంది చిత్ర బృందం. ఇలాంటి సమయంలో మూవీబృందానికి పెద్ద షాక్ తగిలినట్లు వార్తలొస్తున్నాయి. పుష్ప’ నుంచి విజయ్ సేతుపతితప్పుకోనున్నట్లు సమాచారం. అక్రమ కలప రవాణా చేసే లారీ డ్రైవర్పాత్రలో అల్లు అర్జున్కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీస్ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతినటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం.
లాక్ డౌన్ తరువాత విజయ్ సేతుపతిడేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. ఈ ఒక్క సినిమాచేయాలంటే తమిళంలో ఆయన రెండు మూడు సినిమాలు వదులుకోవలసి వస్తోందట. అందువలన ఆయన 'పుష్ప' నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, విజయ్ సేతుపతిస్థానంలో బాబీసింహాను తీసుకోవాలని సుకుమార్భావిస్తున్నట్టు సమాచారం. ఆ మద్య రవితేజనటించిన ‘డిస్కోరాజా’ మూవీలో బాబీసింహావిలన్ గా నటించిన విషయం తెలిసందే.
]]>