ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్రఘురామ్ రాజన్ లాక్‌డౌన్ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిమిత ఆర్థిక వనరులపై కూడా రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నా.. నిరుపేదల పట్ల ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పేదలను మానవత్వంతో వారిని ఆదుకోవడం ప్రభుత్వాల విధి అని రాజన్ సూచిస్తున్నారు.
తగినంత సామాజిక దూరం పాటిస్తూ... అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లాక్ డౌన్‌ను పాక్షికంగా ఎత్తేయాలని రఘురామ్ రాజన్ సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని చెబుతున్నారు. తయారీదారులు తమ సరఫరా గొలుసును తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని.. సాధ్యమైనంత త్వరగా వ్యవస్థను గాడిలో పెట్టాలని రఘురామ్ రాజన్ సూచించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple
]]>