ఈ సినిమాను పాన్ ఇండియాసబ్జెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలార్జ్ స్కేల్ లో తెరకెక్కించడం కరెక్టేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కథకు అంత స్కోప్ ఉందా అని వాదనలు కూడా వస్తున్నాయి. అయితే.. సినిమాకథ అడవి, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ స్మగ్లింగ్ కు ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో బాగా జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఇక కర్ణాటక, కేరళలో కూడా అటవీ ప్రాంతం ఎక్కువే. ఫారెస్ట్ నేపథ్యం ఉన్న మాస్సినిమాలకు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా చూస్తారు.
హిందీలో ఫారెస్ట్ నేపథ్యాన్ని బాగానే ఆదరిస్తారు. కావలిసిందల్లా సినిమారిచ్ గా ఉండడమే. ఇటివల తెలుగు సినిమాలకు యూట్యూబ్లో ఆదరణ బాగా ఉంటోంది. తెలుగు సినిమాల రీమేక్రైట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. బన్నీఅల.. వైకుంఠపురములో కూడా మంచి రేట్ కు అమ్ముడుపోయింది. ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్య బన్నీ - సుకుమార్తీసుకున్న డెసిషన్ సరైనదే అని చెప్పాలి. ఈ సినిమాలో రష్మికహీరోయిన్గా నటించింది.
]]>