కేంద్రప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అతి త్వరలో ప్రకటించనుంది. బ్యాంక్ఆఫ్ అమెరికాసెక్యూరిటీస్ అంచనాల ప్రకారం కేంద్రం ఈ ప్యాకేజీలో ప్రధానంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రాయితీలు అందనున్నాయని తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ కొన్ని రోజుల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం పడకుండా 1,75,000 కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రధానంగా సామాన్యులను దృష్టిలో కేంద్రం రూపొందించింది. మోదీప్రభుత్వం ప్రధానంగా ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణంపై ప్యాకేజీలో దృష్టి పెట్టింది.
ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, వృద్ధిరేటు పెంచడానికి కేంద్రం ఉద్దీపన పథకాలు ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్రం చిన్న పరిశ్రమలు చెల్లించాల్సిన రుణాలపై 2 శాతం రాయితీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు ఉద్దీపనలకు తోడు కేంద్రం ఆదాయం తగ్గితే 2021 ఆర్థిక సంవత్సరానికి లోటు 4.8 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. జూన్త్రైమసికానికి జీడీపీ 2.5 శాతానికి తగ్గుతుందని సమాచారం. ]]>