మానవాళి కదలికలను, కార్యాకలాపాలను కరోనా స్తంభింపజేసింది. ఇంటి నుంచి గడప దాటి కాలు బయటపెట్టనివ్వకుండా నిర్బంధంగా కట్టిపడేసింది. పరిశుభ్రతను నేర్పించింది. చచ్చినట్లు పాటించేలా చేస్తోంది. లేదంటే చస్తావని హెచ్చరిస్తోంది. చేయకుంటే అదీ కూడా చేసి చూపుతోంది. కరోనా ఏం చేస్తుందిలే అనుకున్నవారికి తన తడాఖా ఏంటో చూపిస్తోంది.. అగ్రరాజ్యం..అన్ని విధాలా ఉన్నాం..మనకేంటి భయం..అనుకున్న అమెరికాను ఆగమాగం చేసింది. ఇప్పుడు ఆదేశంలో శవాలు గుట్టలుగా పడుతున్నాయి. కరోనా సునామీలో కొట్టుకుపోతు్న అగ్రరాజ్యం హెల్ప్ ప్లీజ్ అంటూ కాస్త ఒడ్డున ఉన్న దేశాలను కోరుతోంది.
ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్నవి రెండే ఆప్షన్స్..ఒకటి కరోనా వైరస్‌ను తుదముట్టించి మానవాళి మనుగడను ఈ భూమి మీద కొనసాగేలా ధైర్యంగా పోరాటం చేయడం.. రెండోది నిర్లక్ష్యం ప్రదర్శించి ఎవరికీ వారు దేశాల సరిహద్దులు గీసుకుని నియంత్రణ పేరుతో తాత్కలికంగా ఉపశమనం పొందడం. చైనాలో అదుపులోకి వచ్చిందని భావిస్తున్న కరోనా మళ్లీ విజృంభిస్తుండటం దేనికి సంకేతం. ఇప్పటి వరకు కూడా అంతర్జాతీయ వేదికలేకపోవడం మన అనైక్యత లోపాన్ని పూర్తిగా ఎత్తిచూపడం లేదా..? అకరోనా మనలోని వైఫల్యాలను ఎత్తి చూపడం లేదు. కరోనాను అంతం చేయాల్సిన ఈ ప్రపంచం దానికి అనేక అవకాశాలిస్తున్నట్లు లేదు. కరోనాను అంతం చేయడంలో ఆలస్యం చేస్తే అది మనల్ని మట్టుబెట్టడం ఖాయం.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>