Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

ఆ రోజు లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..?

$
0
0
లాక్‌డౌన్‌పై మంగళవారం ప్ర‌ధాని నరేంద్ర మోడీకీలక ప్రకటన చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.  ఏప్రిల్ 14న‌ లాక్‌డౌన్ ముగియ‌నుంది. అయితే ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశాయి. ఈ అంశంపై ప్రధానిమోడీఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు.. లాక్ డౌన్‌ను పొ డిస్తారా.. లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.  ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు  మంగ‌ళ‌వారం ప్ర‌ధాని  మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తార‌ని, లాక్ డౌన్ పొడిగించాలా?  వద్దా ? అన్న నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 


ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందే అదే రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ‌నున్నారు.  విశ్వసనీయ వర్గాల స మాచారం ప్రకారం లాక్‌డౌన్ పొడగింపుకే మోడీమొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే అనేక మార్పులతో లాక్‌డౌన్ కొనసాగిస్తారని సమాచారం. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. అత్యవసర సర్వీసులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వనున్నారని అధికారు లు తెలిపారు. ఇక, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను మూసే ఉంచుతారని స్పష్టం చేశారు.



దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా, కొన్ని రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే అక్కడ సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న కఠిన నిబంధనలను కేంద్రం విధించినుంది. అత్యంతగా నష్టపోయిన రంగాల్లో విమాన రంగం ప్రథమ వరుసలో ఉంది. దీంతో విమానాల రాకపోకలను క్రమంగా ప్రారంభించవచ్చని అయితే, అన్ని తరగతులలో మధ్య సీటు ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తెరపైకి తేనున్నట్లు సమాచారం. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>