ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మానవాళిపై తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నది. ఈ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా బారినపడి యూరప్, అమెరికా, ఇటలీ విలవిలలాడుతున్నాయి. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు పాటిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ పై శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చైనాలోని వూహాన్ నగరంలో మొదటి గుర్తించిన కరోనా వైరస్ కు, ఇప్పుడు మిగిలిన దేశాల్లో చూస్తున్న కరోనాకు మధ్య చాలా వ్యత్సాసం ఉందని పరిశోధ కులు గుర్తించారు. అంతేగాక కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు వచ్చాయని, దీని వల్లే అమెరికాలాంటి దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉం దని వారు పేర్కొంటున్నారు.
ఇక భారత్‌లోకి వచ్చే సరికి జన్యువుల్లో వచ్చిన మార్పుల కారణంగా కరోనా బలహీనంగా మారిందని వారు అంటున్నారు. అం దువల్లే ఇక్కడ కరోనా ప్రభావం తగ్గిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.