మాస్క్ లను తయారు చేయించాలని భావిస్తున్నారట. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మాస్క్ లను తప్పనిసరి చేసిన నేపధ్యంలో మాస్క్ ల కొరత ఎక్కువగా ఉందని... అందుకే హీరోయిన్స్మాస్క్ ల కొరత మీద ఎక్కువగా దృష్టి పెట్టారని సమాచారం. దేశ వ్యాప్తంగా కూడా మాస్క్ లను సరఫరా చేయడానికి ప్రభుత్వాల సహాయం కూడా తీసుకోవాలని చూస్తున్నారు. కొంత మంది హీరోయిన్స్బట్టల తయారీలో పెట్టుబడులు పెట్టారు. దీనితో అక్కడి నుంచి మాస్క్ లను ప్రజలకు అందించే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మన తెలుగులో స్టార్ హీరోయిన్స్గా ఉన్న రష్మిక, పూజ ఇప్పుడు ఇదే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం ఇద్దరూ కూడా దాదాపు 30 నుంచో 50 లక్షల వరకు ఖర్చు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రష్మికదీనిపై కర్ణాటకప్రభుత్వాన్ని కూడా అడిగినట్టు సమాచారం. తాను లక్ష మాస్క్ లను అందిస్తా అని ఆమె చెప్పగా అధికారులు అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఈ మాస్క్ లను ఇవ్వడానికి ఆమె సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. పూజ కూడా ఇప్పుడు అదే పని చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మాస్క్ లను అందించడానికి మరికొందరు హీరోయిన్స్ప్రయత్నం చేస్తున్నారు.
]]>