ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకీలకనిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీనిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేఇదే విషయాన్ని సూచించారు. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ పొడిగించడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దీంతో కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే భావిస్తున్నారు.
]]>