వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రాంతానికి చెందిన డోని అమర్, మేకల దీప్తి(18) ప్రేమించుకున్నారు. వారు ఏలూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
వారు వివాహం చేసుకున్న అనంతరం నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ (కేపీహెచ్‌బీ) పోలీస్ స్టేషన్పరిధిలోని సర్దార్ పటేల్నగర్‌కి వచ్చి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారి వివాహం జరిగిన కొద్దిరోజుల వరకు వారు ఆనందంగా గడిపారు. ఎవరి దిష్టి పడిందో కానీ వారి అనున్య కాపురంలో కలహాలు రేగాయి. ఆమె ఊహించని విధంగా భర్తనుంచి వరకట్న వేధింపులు ప్రాంభమైయ్యాయి. ఆమె కొద్దికాలం మౌనంగా భర్తవేధింపులు భరించసాగింది దీప్తి. అయితే దీప్తికి భర్తవేధింపులు ఎక్కువ కావడంతో వాటిని భరించలేక పోయింది..
అయితే వారు వరకట్నం కోసం మరోమారు గొడవ పడ్డారు. దింతో భర్తవేధింపులు భరించలేక దీప్తి ఆత్మహత్య పాల్పడింది. ఆమె ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగేసి బలవన్మరణానికి పాల్పడింది. అయితే దీప్తి మరణ వార్త తెలుసుకున్న బంధువులు ఇంటికి వచ్చారు. బంధువుల ఇచ్చిన వివరాల ప్రకారం భర్తవేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో వరకట్నం వేధింపులతో చాల మంది చనిపోతున్నారు. వరకట్నం బారినుండి అమ్మాయిలను కాపాడుకోవడానికి దేశంలో చాల చట్టాలను తీసుకొచ్చారు. అయినప్పటికీ దేశంలో వరకట్నాలపై వస్తున్నా ఆగడాలను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. మహిళరక్షణ కోసం దేశంలో చాల చట్టాలను తీసుకొచ్చారు.
]]>