కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా... ప్రస్తుతం ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించటమే కాకుండా దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ ప్రజలందరూ పాటించి ఇంటికే పరిమితం అయ్యేలా చేసేందుకు ప్రస్తుతం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ కి తోడు ఎండాకాలం కూడా తోడవడంతో పోలీసులకు సవాల్ గా మారిపోయింది. ఎండలను లెక్కచేయకుండా నే కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు.
అయితే తాజాగా పోలీసులకు కొత్త టోపీ వచ్చింది. మామూలుగా అయితే పోలీసులు కాకి టోపీ ధరిస్తారు. కానీ ప్రస్తుతం కొత్త టోపీ ధరించారు పోలీసులు. ఇప్పుడు వరకు పోలీసులు ఇలాంటి టోపీ పెట్టుకుని ఎప్పుడు కనిపించి ఉండరు . మొత్తానికి అయితే ఈ కొత్త టోపీలు పోలీసులు కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్నారు పోలీసులు . నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త టోపీలను ధరించారు . ఇంతకీ ఈ కొత్త టోపీలు ఎందుకు అంటారా ... ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎండలు దంచికొడుతున్న క్రమంలో రోడ్ల మీద నిలబడుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసులు ఆరోగ్యం పాడవకుండా ఉండేందుకు కూలింగ్ గ్లాసెస్ ఉన్న టోపీ ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం తెప్పించారు. అంతేకాదు ఎండ తీవ్రతను తగ్గించే నిర్మాణం కూడా ఈ టోపీ లో ఉంటుంది. ఎస్పీ భాస్కరన్ నేతృత్వంలో ఈ టోపీలను ట్రాఫిక్ కానిస్టేబుల్ కు పంపిణీ చేశారు. ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా నిరంతరం శ్రమించే పోలీసు ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం శుభపరిణామమని పలువురు భావిస్తున్నారు.
]]>