ఈ జనాలు ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు.. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే ఇలాంటి వ్యక్తి మన ఏపీలో ఉండడం నిజంగా నిజంగా అందరి అదృష్టమే. అసలు రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబే. మంచి అయినా చెడు అయినా బాబు కి రాజకీయమే తెలుసు. సెంద్రబాబు రాజకీయానికి బలి అవ్వని వారు లేరు కదా ! నమ్మించి గొంతు కోయడంలో కానీ, వెన్నుపోటు పొడవడం లో కానీ, బాబు గారి కి బాబు గారే సాటి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే... ఇప్పుడు కరోనా కంగారు లో ప్రజలంతా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు అనే తేడా లేదు, ఎప్పుడూ నాకు రాజకీయమే కావలి అన్నట్టుగా సెంద్రబాబు చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు కదా.
సలహాలు ఇస్తాను వాడుకోండి... అంటూనే కుట్ర రాజకీయాలు చేసుకుంటూ కుతంత్ర రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. తనకి సంబంధం ఉన్న, లేని అన్ని విషయాల్లోనూ సెంద్రబాబు కలగజేసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పెజానీకం అంతా చాలు చాల్లే వెళ్ళవయ్యా అంటూ ఇంటికి పంపేసినా... కిందపడ్డా.. పై చేయి నాదే అన్నట్టుగా ఇప్పటికి బాబు గారు చేస్తున్న రాజకీయ హడావుడి అంతా ఇంతా కాదు. అసలు బాబు గారి వయస్సు మీరినా... అస్సలు లెక్కచేయడమే లేదు. రాజకీయాలపై తనకు ఇంకా మక్కువ పోలేదు అన్నట్టుగా బాబు గారు చేస్తున్న నానా రకాలైన రాజకీయాలను చూస్తున్న... భరిస్తున్న వారికి... సినబాబు గారికి ఆయన తండ్రిపెద బాబు గారికి తప్పకుండా 'ఓ' ఏస్కోవాల్సిందే.