ప్రపంచంలోని దేశాలను కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. భారత్లోను కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రోగనిరోధక శక్తితక్కువగా ఉన్నవారికి కరోనా సోకుతూ ఉండటంతో ఆయుష్ శాఖ రోగ నిరోధక శక్తిపెంచుకోవడానికి కీలక సూచనలు చేసింది. ఆయుష్ శాఖ ఎప్పుడు దాహం వేసినా వేడి నీటినే తాగాలని సూచించింది. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలని చెప్పింది.
వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పసుపు వంటకాల్లో తప్పక ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఎండు ద్రాక్ష, శొంఠి, మిరియాలు, తులసితో చేసిన ఆయుర్వేదతేనీరును తాగాలని పేర్కొంది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పాలలో కలుపుకుని తాగాలని తెలిపింది. ఉదయం, సాయంత్రం కొబ్బరి నూనెను ముక్కు రంధ్రాల దగ్గర పట్టిస్తే మంచిదని పేర్కొంది. రోజుకు రెండు నిమిషాల పాటు కొబ్బరి నూనెను పుక్కిలించి ఉమ్మివేయాలని.. గోరువెచ్చని నీటితో నాలుకను శుభ్రం చేసుకోవాలని పేర్కొంది.
సోంపు గింజలు లేదా పుదీనా ఆకుల నీటిఆవిరిని పొడిదగ్గు ఉన్నవారు రోజుకు ఒకసారి పీల్చుకోవాలని సూచించింది. బెల్లంతో లేదా తేనెతో లవంగాల పొడిని కలుపుకుని తాగితే మంచిదని తెలిపింది. దగ్గు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ]]>