అయితే తనతో పాటు తమ పార్టీకి చెందిన ఔరంగాబాద్ఎంపీని కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించలేదని ఓవైసీ పేర్కొన్నారు. ఇక కేరళలో ఉన్న ‘ఇండియన్ ముస్లిమ్ లీగ్’ నుంచి ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారినీ కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించలేదని అన్నారు. అయితే మోదీనుంచి సరైన సమాధానం తనకు లభించ లేదని ఓవైసీ పేర్కొన్నారు. లాక్‌డౌన్, కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న ఏమాత్రం సక్రమంగా లేదని, కొంతమంది జిహాద్ కరోనా అంటూ కామెంట్లు పెడుతున్నారని అన్నారు.
ఇది సరైంది కాదని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమంతా ఒక్కటి అవుతోందని, కానీ భారత్‌లో మాత్రం కొంతమంది విద్వేషాన్ని పెంచిపోషిస్తున్నారని అన్నారు. కరోనా విలయానికి మతం,కులం ఉండవని నిర్లక్ష్యం చేస్తే అందరికి ప్రమాదకారిగా మారుతుందని అన్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తబ్లీగి జమాత్‌ను టార్గెట్ చేయడం కరెక్టు కాదని, ఈ సభకు ముందు ఇండియాకు దాదాపు 15లక్షలమంది వచ్చారన్న విషయాన్ని విస్మరించవద్దని అన్నారు. కానీ కొంతమంది కేవలం తబ్లిగీ జమాత్ పైనే ఆరోపణలు చేయడం పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>