న్యాయకోవిదుడు కనగరాజ్‌కు ఎస్ఈ సి పదవి కట్టబెట్టినట్లు వైసీపీఎమ్మెల్యేఅంబటి రాంబాబు తెలిపారు. ``ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. గతంలో పంచాయితీరాజ్ యాక్ట్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం ఐదు సంవత్సరాలు పాటు ఉండేది. దానిని మూడు సంవత్సరాలకు కుదించింది. దానితోపాటు ఇంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను నియమించాలనే సంప్రదాయం, రూల్ ఉండేది దానికి భిన్నంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కాకుండా న్యాయమూర్తులుగా ఉండి రిటైరైన వారిని నియమించాలని నిర్ణయించారు. `` అని అంబటి తెలిపారు.
ఐఏఎస్ అధికారులను వేయడం ద్వారా కొంత వ్యవస్దకు నష్టం జరగవచ్చనే అనుమానం ఉందని అంబటి అన్నారు. `ఐఏఎస్‌లు వివిధ హోదాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వం దగ్గర పనిచేస్తారు. కాబట్టి వారికంటే కూడా న్యాయకోవిదులుగా ఉన్నవారు ఆ పదవిలో ఉంటే మరింత బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం ఉంది. ఇది ఎన్నికల సంస్కరణలలో భాగంగా.. విధానపరమైన నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంది. ఇది వ్యవస్దలను,చట్టాలను మరింత పటిష్టంగా అమలుచేయడానికి నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి, ఎన్నికల నిర్వహణలో చక్కని పటిష్టతకు రుజువుగా ఉండేవిధంగా ప్రవర్తించడానికి అనుకూలించే నిర్ణయాలుగా రాష్ర్ట ప్రభుత్వం భావించింది.ఈ నిర్ణయాన్ని చాలా మంది మేధావులు కూడా హర్షిస్తున్నారు. `` అని అంబటి తెలిపారు.
రాష్ర్టానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొన్నటి ఎన్నికలలో తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొన్న రాష్ర్ట ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ నిర్ణయంపై అనేక విమర్శలు చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ``విమర్శలు చేసేవారికి, రాష్ర్ట ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని మేం భావిస్తున్నాం. ఈరోజున మూడు సంవత్సరాలు నిండాయి కాబట్టి.. ప్రస్తుత కమిషనర్ తాను తప్పుకుంటే కొత్తవారిని, రిటైర్డ్ జస్టిస్ ను ఆ స్థానంలో నియమించడం జరిగింది. ఆయనే జస్టిస్ వి. కనగరాజ్.` అని అంబటి పేర్కొన్నారు.
]]>