డ్యాన్స్ మాస్టర్గా.. యాక్టర్ గా.. డైరెక్టర్గా మెప్పించిన లారెన్స్ కష్టాల్లో ఆదుకుంటాడన్న పేరుంది. ట్విట్టర్వేదికగా.. తర్వాతి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన విషయంతో పాటు.. కరోనా బాధితులకు తన వంతుగా 3కోట్ల భారీ విరాళం ఇవ్వనున్నట్టు తెలిపాడు. 15ఏళ్ల క్రితం సూపర్ స్టార్కు బ్లాక్ బస్టర్ఇచ్చిన సినిమాచంద్రముఖిసీక్వెల్లో లారెన్స్నటించడం విశేషం.
లారెన్స్తన అభిమాన నటుడు రజినీకాంత్చిత్రం చంద్రముఖిసీక్వెల్లో నటిస్తున్నాడు. రజినీకాంత్అనుమతితో.. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో సన్ పిక్చర్ అధినేత కళానిధి మారన్ఆశీస్సులతో దక్కిన ఈ అవకాశాన్ని తన అధృష్టంగా భావిస్తున్నానన్నారు లారెన్స్. ఈ చిత్రం ద్వారా వచ్చిన అడ్వాన్స్ లో రూ.3కోట్లు కరోనా వైరస్రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చినట్టు ట్వీట్ చేశాడు లారెన్స్.
లారెన్స్ఇచ్చిన 3కోట్ల విరాళాన్ని ఆరు రకాలుగా పంచారు. పీఎం-కేర్స్ ఫండ్ కు 50లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు, సౌత్ ఇండియాకార్మికుల సంఘం ఫెప్సీకి రూ.50లక్షలు ఇచ్చారు. అలాగే డ్యాన్సర్స్ యూనియన్ కు 50లక్షలు, దివ్యాంగ పిల్లలకు రూ.25లక్షలు ఇవ్వనున్నారు. స్వస్థలం రోయపురంలో పోలీసుల సహాయంతో దినసరి కార్మికులకు, ప్రజల అవసరాలను తీర్చేందుకు 75లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు లారెన్స్.
లారెన్స్ప్రస్తుతం అక్షయ్ కుమార్, కియారా అద్వానీజంటగా.. కాంచనహిందీరీమేక్లక్ష్మీబాంబ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాషూటింగ్ దాదాపు పూర్తయింది.
]]>