ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమయ్యారు అందరూ. దీనితో ఫేస్ బుక్ లైవ్ లోకి అభిమానుల ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా పలువురు నటులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాళ్లను ఆకట్టుకున్నారు. తాజాగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతున్న వీడియోను యూట్యూబ్ఛానల్ లో ఉంచడం జరిగింది. ఇందులో ఆర్.ఆర్.ఆర్సినిమాపై ఉన్న అభిప్రాయం గురించి నన్ను కొందరు అడిగారు అని నాగబాబు తెలిపారు.
ఆ సమయంలో ఎవరికైతే నేను సమాధానం ఇవ్వలేదో వారి కోసమే ఈ వీడియో అంటూ నాగబాబు తెలిపారు. ఇటీవల రామ్ చరణ్బర్త్ డే రోజున చరణ్పోషిస్తున్న అల్లూరిసీతారామరాజు పాత్రను తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో చూశాను.. ఆ వీడియో పూర్తిగా చూశాక రామరాజు పాయింట్ ఆఫ్ లో ఎన్టీఆర్పాత్ర కొమరం భీమ్ఎలా ఉంటాడో అన్న ఆత్రుత చాలా ఎక్కువ అయ్యింది అంటూ నాగబాబు తెలిపారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించి ఫస్ట్ ప్రోమో తోనే ప్రేక్షకులను చాలా ఆకట్టుకుందని తెలిపారు.
ఈ సినిమాగురించి నేను విన్న కథ ఏమిటంటే.. అల్లూరిసీతారామరాజు, కొమరం భీమ్.. వీరిద్దరు తెలుగు రాష్టాలలోని మన్యం, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం యుద్ధం చేసిన విప్లవ వీరులని, ఒకవేళ వీరిద్దరు ఎక్కడైనా కలిసి ఉంటే ఎలా ఉండేది అనే కోణాన్ని ఇందులో చూపించనున్నారని ఆయన సూచన ప్రాయంగా తెలిపాడు.