ఇక ఇప్పుడు ప్రభాస్వచ్చే సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఖాళీ గా ఉండటం తో అతను కథలను ఎంపిక చేసుకుని సినిమాలను చెయ్యాలని భావిస్తున్నాడు. కథల ఎంపికల విషయంలో తన పెదనాన్న సలహాలను తీసుకోవాలని భావిస్తున్న ఈ హీరోఇప్పుడు నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ అయిపోయే సినిమాఅయితే తాను చేసేది లేదని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో చేసే సినిమాలు చేస్తున్నాడు. దీనితో సినిమాధర భారీగా పెరుగుతుంది.
వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై ఇప్పుడు నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా వద్దని కొందరు సూచించినా సరే అతను మాత్రం మార్కెట్ని ఎక్కువగా దృష్టి పెట్టుకుని ఈ సినిమాలు చేస్తున్నాడని రెండు సినిమాలను ఇలాగే చేసే యోచనలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాభారీ బడ్జెట్ తో వస్తుందే. ఈ సినిమారాధాక్రిష్ణ దర్శకత్వంలో రావడం తో ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నేలకొంది. ప్రభాస్సాహోసినిమాతర్వాత పారితోషికం కూడా భారీగా పెంచాడని వార్తలు వస్తున్నాయి. దీనితో నిర్మాతలు అతని సినిమాలు అంటే భయపడే పరిస్థితి వచ్చింది.
]]>